: భారత సినీ చరిత్రలో 'బాహుబలి-2'ని మించింది లేదు.. ఆద్యంతం అద్భుతం: యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు సంధు
బాహుబలి-2 సినిమా ఆద్యంతం.. అదరహో అంటూ యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమెయిర్ సంధు ఆకాశానికెత్తేశాడు. సినిమా మొత్తం మహాద్భుతం అంటూ కితాబిచ్చాడు. సినిమాలో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదని తేల్చి చెప్పాడు. హ్యాట్సాఫ్ టు ప్రభాస్ అంటూ అమరేంద్ర బాహుబలిని ప్రశంసించాడు. ఇండియాకు సంబంధించిన సినిమాల్లో ఇంత గొప్ప సినిమాను తాను చూడలేదని అన్నాడు.
ఈ శుక్రవారం నాడు చరిత్ర తిరగరాయబడుతుందని చెప్పాడు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ కొనియాడాడు. భారతీయ సినీ చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినందుకు, సినీ పరిశ్రమను మరింత ఎత్తుకు తీసుకెళ్లినందుకు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు ప్రశంసలను బాహుబలి-2 అందుకొన్నదని చెప్పాడు. కాసేపటి క్రితం యూఏఈ సెన్సార్ బోర్డు ఈ సినిమాను చూసింది. ఈ నేపథ్యంలోనే, ఆ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమెయిర్ ఈ సినిమా ఎలా ఉందో అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ట్వీట్ల రూపంలో తెలియజేశాడు. సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు.