: ఆ పార్టీల తీరు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా ఉంది: వెంకయ్యనాయుడు


ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చూసి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు.ఈవీఎంలపై ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీల తీరు చూస్తుంటే.. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఉందని విరుచుకుపడ్డారు. 2015 ఎన్నికల్లో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వచ్చాయని, మరి, అప్పుడు కూడా ఈవీఎంలు ఉన్నాయని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, ఢిల్లీ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News