: వరి కోత మిషన్ లో పడి తల్లీకొడుకుల మృతి
ప్రమాదవశాత్తు వరికోత మిషన్ లో పడి తల్లీకొడుకులు మృతి చెందిన విషాద సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వలగుండ మండలం సులువాయి గ్రామానికి చెందిన లక్ష్మి(42), జగదీష్(16) తమ పొలం వద్ద ఈ రోజు పంటకోయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ లో పడిపోవడంతో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.