: దారుణం...ఫేస్ బుక్ లైవ్ లో 11 నెలల కుమార్తెను ఉరితీసి... తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు
ధాయ్ లాండ్ లో దారుణం చోటుచేసుకుంది. 11 నెలల కుమార్తెను ఫేస్ బుక్ లైవ్ టెలికాస్ట్ లో ఉరితీసి, ఆ పక్కనే ఉరివేసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ వీడియోను ఫేస్ బుక్ తొలగించినప్పటికీ ఒకరోజంతా సోషల్ మీడియాలో ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ధాయ్ లాండ్ లో బ్యాంకాక్ లో వుటిసాన్ వాంగ్ టాలే అనే వ్యక్తి జిరానుచ్ ట్రిరటానా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు అంతకు ముందే మాజీ భర్తకు పుట్టిన ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. దీంతో వారి మధ్య విభేదాలు పొడసూపేవి. దీంతో వుటిసాన్ ఆ బాలుడ్ని కొట్టేవాడు. దీంతో జిరానుచ్ అతనితో వాగ్వాదానికి దిగేది. ఇది ఘర్షణకు దారితీసేది. ఈ నేపథ్యంలో తన భార్య తనను ప్రేమించడం లేదని వుటిసాన్ ఆవేదన చెందేవాడు. అతని వేధింపులు పెరగడంతో జిరానుచ్ అతని నుంచి విడాకులు తీసుకుని దూరం వెళ్లిపోయింది.
అయితే అతనికి కూతురంటే అంతులేని ప్రేమ ఉండడంతో అతని కోరిక మేరకు 11 నెలల కుమార్తెను అతని వద్దే వదిలేసింది. ఈ క్రమంలో భార్య తనను వదిలేసి వెళ్లిపోవడం, తనను ప్రేమించకపోవడంతో ఆందోళన చెందిన వుటిసాన్ వాంగ్ టాలే...తన 11 నెలల కుమార్తెను ఫేస్ బుక్ లైవ్ లో ఉరితీశాడు, అనంతరం ఆ పక్కనే మరో ఉరికి తను వేలాడాడు. కుమార్తెను ఉరితీసిన వీడియో ఫేస్ బుక్ లో ఒక రోజంతా ఉండిపోయింది. తరువాత అభ్యంతరకరమైన పోస్టు అంటూ ఫేస్ బుక్ యాజమాన్యం ఆ వీడియోను తొలగించింది. దీనిపై జిరానుచ్ మాట్లాడుతూ...తన కుమర్తెను ఇలా చేస్తాడని ఊహించలేదని తెలిపింది. తానంటే ఉన్న కక్షతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. తన కుమారుడ్ని కొడుతుండడంతోనే అతని నుంచి తాను దూరమైనట్టు ఆమె తెలిపింది.