: బాహుబలి తొలి రోజు కలెక్షన్ల అంచనా... చూస్తే దిమ్మ తిరుగుతుంది!


రేపు రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న, ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ 'బాహుబలి: ది కన్ క్లూజన్' తొలి రోజు కలెక్షన్ల అంచనాపై సినీ విశ్లేషకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ చిత్రం తొలి రోజున రూ. 150 కోట్ల వరకూ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్క ఎలాగంటే, ప్రపంచవ్యాప్తంగా 8 వేల థియేటర్లకు పైగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. 8 వేల థియేటర్లలో తొలి రోజున 5 షోల చొప్పున ప్రదర్శిస్తే, మొత్తం 40 వేల షోలు పడతాయి.

ఒక్కో షోలో సగటున 400 మంది చిత్రాన్ని వీక్షిస్తారని భావిస్తే, 1.60 కోట్ల మంది తొలిరోజున సినిమా చూసేస్తారు. ఇక ఒక్కో టికెట్ ఖరీదు సగటున రూ. 100గా లెక్కేసినా, తొలి రోజు కలెక్షన్ రూ. 160 కోట్లకు చేరుతుంది. శుక్రవారం విడుదల కానున్న చిత్రానికి, గురువారం రాత్రి నుంచే పలు థియేటర్లలో బెనిఫిట్ షోలు పడనున్నాయి. ఇక వారాంతమైన శని, ఆదివారాల్లో సైతం అన్ని థియేటర్లూ నిండిపోయే అవకాశాలే అధికం. ఈ లెక్కన చూస్తే, బాహుబలి రెండో భాగం తొలివారంలోనే రూ. 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఇలా తొలివారంలోనే రికార్డు కలెక్షన్లు సాధించి, ఆపై మరో రెండు మూడు వారాలు మామూలుగా నడిచినా, సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 

  • Loading...

More Telugu News