: ఏర్పేడు ఘటన వలన టీడీపీ సర్కారుకు చెడ్డపేరు వచ్చింది: ఆచ్చెన్నాయుడు


చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాద ఘటన తరువాత తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది బాధాకరమైన అంశమని అన్నారు. ఈ తరహా ఘటనల వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారని తెలియగానే వారిని సస్పెండ్ చేశామని ఆయన గుర్తు చేశారు.

 జాతీయ రహదారులను సక్రమంగా నిర్వహించేందుకు తాము డబ్బులు చెల్లిస్తున్నామని, వాళ్లు తమ పనిని సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెక్ పోస్టుల వద్ద మద్యం సేవించే వారిని గుర్తించేందుకు తనిఖీలు చేయాలని ఆదేశించారు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వాహనాలు నడిపేవారు మద్యం సేవించినట్టు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News