: కేజ్రీవాల్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు: అమిత్ షా
ఢిల్లీ నగరపాలక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ ఆప్ ఈ ఎన్నికల్లో డీలా పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ పాలనకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రెండేళ్ల ఆప్ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. విమర్శనాత్మక రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని తెలిపారు.
2015 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు ఈవీఎంల వల్లే ఓడిపోయామని అంటుండటం విడ్డూరంగా ఉందని అమిత్ షా విమర్శించారు. మోదీ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమని ఢిల్లీ ప్రజలు నిర్ధారించారని చెప్పారు. విమర్శల రాజకీయాలతో కేజ్రీవాల్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని ఎద్దేవా చేశారు.