: నెహ్రూ కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేష్


ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కుటుంబసభ్యులను మంత్రులు నారా లోకేష్, నిమ్మకాయల చినరాజప్పలు పరామర్శించారు. గుణదలలోని నెహ్రూ నివాసానికి వెళ్లిన వీరు... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, నెహ్రూ లేని లోటు టీడీపీకి, విజయవాడకు తీరనిదని అన్నారు. నెహ్రూ కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. వీరితో పాటు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, గద్దె రామ్మోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు నెహ్రూకు నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News