: ఒక్క దెబ్బతో ఏడాదికి 15 ప్రభుత్వ సెలవులను రద్దు చేసిన యూపీ సీఎం యోగి!


ఉత్తరప్రదేశ్ ను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి... తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్క దెబ్బకు ఏకంగా ఏడాదికి 15 సెలవులు రద్దు చేశారు. యూపీలో ఇప్పటి వరకు ఏడాదికి 42 సెలవులు ఉన్నాయి. ప్రముఖుల జయంతులు, వర్ధంతులు, పండుగలు ఇలా రకరకాల సెలవులు ఉన్నాయి.

సంవత్సరంలో ఇన్ని సెలవులు ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు ఎలా పని చేస్తాయంటూ యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల జయంతుల సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించకుండా... ఆ రోజు రెండు గంటలపాటు వారి గొప్పదనం గురించి పిల్లలకు బోధిస్తే బాగుంటుందని ఇంతకు ముందే ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 15 పబ్లిక్ హాలిడేలను రద్దు చేస్తున్నట్టు కేబినెట్ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రకటించారు. ఆయా రోజుల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News