: కళాతపస్వి తీసిన 12 అద్బుత సినిమాలతో డిస్క్ ను తెస్తున్నా!: త్రివిక్రమ్ శ్రీనివాస్


టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ తీసిన 12 అత్యుత్తమ సినిమాలతో ఒక డిస్క్ ను సినీ ప్రియులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ఆయనకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాదులో ఆయన నివాసం వద్ద త్రివిక్రమ్ మాట్లాడుతూ, కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన తిరుగులేని చిత్రాలు అందించారని కొనియాడారు. ఆయన సినిమాల్లోని 12 సినిమాలతో కూడిన డిస్క్ ను తీసుకురావడం ద్వారా తెలుగు సినీ ప్రియులకు ఆయనను మరింత చేరువచేయనున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News