: ఒకసారి పార్టీకి వెళ్తే బుద్ధిగా ఉన్నారు...రెండోసారి పార్టీ తరువాత సామూహిక అత్యాచారం చేశారు!


పార్టీ కల్చర్ ఒక మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే...పశ్చిమ బెంగాల్ కు చెందిన 27 ఏళ్ల మహిళ భర్తతో విడాకులు తీసుకుని కెరీర్ నిర్మించుకోవడంలో భాగంగా ఆరు నెలల క్రితం బెంగళూరు చేరింది. స్నేహితురాలితో ఉంటూ ఉద్యోగవేటలో పడింది. ఈ క్రమంలో ఆమెకు రాకేష్, రాజేష్, నరసింహమూర్తి అనే ప్రైవేటు ఉద్యోగులు పరిచయమయ్యారు. వారిని నమ్మిన ఆమె వారితో ఓసారి పార్టీకి వెళ్లింది.

అనంతరం ఫ్రెండ్స్ తో పార్టీ అంటూ ఆ పార్టీలో దిగిన ఫోటోలను ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసింది. తొలిసారి పార్టీలో బుద్ధిగా ఉండడంతో... మరోసారి మార్చి 26న ఆమెను కోరమంగళంలోని ఒక పబ్ కు పార్టీ అంటూ తీసుకెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరు అవుటర్ రింగు రోడ్డుపై ఆపి, మద్యం తాగి, గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News