: 30 వేలు దాటిన సెన్సెక్స్... 20 నెలల తరువాత రూ. 64 దిగువకు డాలర్


అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు బలంగా ఉండటంతో, బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక ఆల్ టైం రికార్డు దిశగా పరుగులు పెట్టింది. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభమైన తరువాత సెన్సెక్స్ 30 వేల పాయింట్ల మైలురాయిని దాటి దూసుకెళ్లింది. ఈ ఉదయం 10:10 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 113 పాయింట్ల వృద్ధితో 30,054 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

మరోవైపు నిఫ్టీ 9,350 పాయింట్ల వద్ద కదలాడుతోంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ కూడా భారీగా లాభపడింది. దాదాపు 20 నెలల తరువాత డాలర్ విలువ రూ. 64 స్థాయికన్నా కిందకు దిగివచ్చింది. ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకపు విలువ రూ. 63.93కు చేరింది. గడచిన ఏడాది వ్యవధిలో రూపాయి విలువ 6 శాతం పెరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News