: పది మంది యువతులను వంచించిన యువకుడు!


ప్రేమ పేరుతో యువతులను వంచించడం, ఆ తర్వాత వారి నగ్న దృశ్యాలను చూపిస్తూ బెదిరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సింగం అనిల్ కుమార్ ఓ యువతిని లోబరుచుకుని, ఆమె నగ్న దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. అనంతరం వాటిని ఫేస్ బుక్ లో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో, ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు ఏలూరులో అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్ల నుంచి ఈ ప్రబుద్ధుడు ఇదే పనిలో ఉన్నాడట. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లోని దాదాపు 10 మంది యువతుల జీవితాలతో ఇదే విధంగా ఆడుకున్నాడట.

ఆడంబర జీవితానికి అలవాటైన అనిల్ కుమార్, టిప్ టాప్ గా తయారై బైక్ లపై తిరుగుతూ అమ్మాయిలకు వల వేసేవాడు. బుట్టలో పడిన యువతులను లోబరుచుకుని, ఆ తర్వాత డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టేవాడు. తాజాగా, ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఇతడి బండారం బట్టబయలైంది.

  • Loading...

More Telugu News