: నేడు పాతబస్తీకి వస్తున్న మోదీ సోదరుడు
ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఈ సాయంత్రం హైదరాబాదులోని పాతబస్తీకి వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, సన్నిహితులు కూడా విచ్చేస్తున్నారు. వీరంతా తమిళనాడులోని కాంచీపురం నుంచి నేరుగా ఇక్కడకు వస్తున్నారు. ఈ సందర్భంగా నగర రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధి జ్యోతిధర్ సింగ్ నివాసంలో విందు ఆరగిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్లతో సమావేశమై... సమస్యలపై చర్చిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. ప్రహ్లాద్ మోదీ రాక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.