: పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజీ కుదిరిందా?


తమిళనాట గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న ఉత్కంఠకు నేడు తెరపడనున్నట్టు తెలుస్తోంది. దినకరన్ అరెస్టుతో రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరినట్టు తమిళ మీడియా పేర్కొంటోంది. రెండాకుల గుర్తు కోసం జాతీయ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్టు వరకు ఆగి, ఆ తరువాత పార్టీని విలీనం చేయాలని పన్నీరు సెల్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. విలీనం అనంతరం ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగనుండగా, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి మినహా పన్నీరు సెల్వం డిమాండ్లను కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనిపై వాస్తవాలు నేడు వెల్లడి కానున్నట్టు సమాచారం. కాగా, దినకరన్ ను అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News