: టెస్టులకు ఆదరణ పెరిగేందుకు లారా కొత్త ఫార్ములా!
టీ20ల రాకతో క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌లకు ఆదరణ తగ్గడంపై వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఆవేదన వ్యక్తం చేశాడు. టి20లకు తాను అనుకూలమేనని అయితే టెస్ట్‌మ్యాచ్‌లు కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. టెస్ట్‌లకు తిరిగి ఆదరణ పెరిగేందుకు సరికొత్త ఫార్ములాను సూచించాడు. టెస్టుల్లో డ్రా అన్నదే లేకుండా రద్దు చేసి ప్రతి మ్యాచ్‌లోనూ ఫలితం తేలేలా చూడాలన్నాడు. ప్రతి టెస్ట్‌లోనూ ఫలితం రావాలనే తాను కోరుకుంటానని పేర్కొన్నాడు. ఐదు రోజులపాటు జరిగే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు గెలిచే సరికొత్త ఫార్ములాను కనిపెట్టాలని సూచించాడు. అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనన్నాడు. కాగా టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు లారా పేరుమీదే ఉంది. 2004లో ఇంగ్లండ్‌పై అజేయంగా చేసిన 400 పరుగుల రికార్డు ఇప్పటికీ భద్రంగా ఉంది.