: నాలుగు రోజుల విచారణకు తెర.. శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్


ఊహించినదే జరిగింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌, ఆయన స్నేహితుడు మల్లికార్జున్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.  నాలుగు రోజుల విచారణ అనంతరం మంగళవారం అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రవీణ్ రంజన్ గత అర్ధరాత్రి 11.52 గంటలకు అరెస్టును ప్రకటించారు.

కేసు దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఏడు గంటలు, రెండో రోజు 10, మూడో రోజు 9, నాలుగో రోజు 10 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు అతని నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టారు. బ్రోకర్ సుఖేశ్ చంద్రశేఖర్‌ను తాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే అతడికి తాను డబ్బులు ఇవ్వలేదని విచారణలో దినకరన్ పేర్కొన్నారు. విలీన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దినకరన్ అరెస్ట్‌తో తమిళనాట పరిణామాలు శరవేగంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దినకరన్ అరెస్ట్‌ వెనుక బీజేపీ, పన్నీర్ సెల్వం కుట్ర ఉందని శశికళ వర్గం నేత నాంజిల్ సంపత్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News