: అలిగిన చిత్తూరు నేతలు.. బాబుతో భేటీకి డుమ్మా!


మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించారని కినుక వహించిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగిన ఎంపీ శివప్రసాద్ లిద్దరూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చిత్తూరు జిల్లా టీడీపీ నేతల సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో సొంత పార్టీ నేతల వైఖరిపై పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారు. అభిప్రాయ భేదాలు, సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ ప్రతిష్ఠ మసకబారకుండా చూడాలని చంద్రబాబు చేస్తున్న హితబోధను వారిద్దరూ పట్టించుకోకపోవడం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News