: ‘లేడీస్ టైలర్’ నా జీవితానికో మూలస్తంభం: తనికెళ్ల భరణి


గతంలో విడుదలైన ‘లేడీస్ టైలర్’ చిత్రం తన జీవితానికో మూలస్తంభం అని ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ సినిమాలోని మూడో పాటను తనికెళ్ల భరణి ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రసుగా నిలిచిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ఇప్పుడు చూసినా కొత్త అనుభూతినే ఇస్తుందన్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, వంశీ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరో సుమంత్ అశ్విన్ సరసన అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్ నటించారు.

  • Loading...

More Telugu News