: నన్ను రేప్ చేశాడని ఫిర్యాదు చేసినా పోలీసులు నమ్మరని కేసు పెట్టలేదు: హాలీవుడ్ నటి


తనపై రేప్ చేసిన వ్యక్తి తనను రేప్ చేశాడని చెప్పినా పోలీసులు నమ్మరని భావించి ఫిర్యాదు చేయలేదని అమెరికన్‌ నటి ఎబిగెయిల్‌ బ్రెస్లిన్‌ తెలిపింది. గతంలో లైంగిక దాడుల బాధితులకు అండగా నిలిచేందుకు జరిగిన ఉద్యమం సందర్భంగా తమపై జరిగిన దాష్టీకాన్ని బాహ్యప్రపంచానికి హాలీవుడ్ సెలబ్రిటీలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎబిగెయిల్ బ్రెస్లిన్ కూడా తాను లైంగిక దాడికి గురయ్యానని గుర్తుచేసుకుంది. దానిపై వివరణ ఇస్తూ... చాలా రేప్‌ కేసుల్లో నిందితులకు శిక్ష పడలేదన్న కారణం కూడా తాను ఫిర్యాదు చేయకపోవడానికి గల కారణాల్లో ఒకటని తెలిపింది. అంతే కాకుండా, ఆ రేప్ తరువాత పూర్తి షాక్‌ లోకి వెళ్లిపోయానని చెప్పింది. అంతే కాకుండా ప్రపంచానికి తాను బాధితురాలిగా కనిపించాలని భావించలేదని తెలిపింది.

అంతే కాకుండా తనను రేప్‌ చేసిన వ్యక్తితో రిలేషన్‌ షిప్‌ కూడా ఉండడంతో అతనిపై ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ఒకవేళ ఆ సమయంలో తాను అతను తనను రేప్‌ చేశాడని చెప్పినా పోలీసులు నమ్మరని భయపడ్డానని చెప్పింది. తీరా అతనిపై ఫిర్యాదు చేసిన తరువాత ఆ కేసు నిలబడకపోతే అతను తనను మరింత బాధించే అవకాశం ఉండడం కూడా తన భయానికి కారణమైందని చెప్పింది. అంతే కాకుండా రేప్ జరిగిందని చెప్పి తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనుకోలేదని తెలిపింది. దీంతో ఏడాది క్రితం జరిగిన రేప్ ఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. అయితే ఆ విషాదం నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకున్నానని, చాలా పురోగతి కనిపించిందని, ఇప్పటికీ గతం గుర్తుకు వస్తే బాధగా ఉంటుందని ఎబిగెయిల్ వెల్లడించింది. 

  • Loading...

More Telugu News