: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు


బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విధంగా సీబీఐ మాజీ డైరెక్టర్ పై కేసు నమోదు కావడం ఇది రెండోసారి. గతంలో.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన కోనేరు ప్రసాద్ కుమారుడు, ట్రైమ్యాక్స్ గ్రూప్ చైర్మన్ ప్రదీప్ కు
సీబీఐ మాజీ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ (ఏపీ సింగ్), హవాలా డీలర్, మాంసం ఎగుమతి వ్యాపారి అయిన మోయిన్ ఖురేషితో సన్నిహిత సంబంధాలపై సీబీఐ ఆరా తీసి.. ఏపీ సింగ్ పై కేసు నమోదు చేయడం జరిగింది.

కాగా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొగ్గు కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన పలువురు నిందితులు, అప్పట్లో రంజిత్ ను ఆయన నివాసంలో కలిశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రంజిత్ సిన్హాపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐను కోర్టు ఆదేశించడం జరిగింది.

  • Loading...

More Telugu News