: తెలంగాణ భూ సేకరణ బిల్లుకు ‘కేంద్రం’ కొర్రీలు!
తెలంగాణ భూ సేకరణ బిల్లు-2016ను కేంద్ర ప్రభుత్వం తిరిగి పంపనుంది. ఈ భూ సేకరణ బిల్లుపై రెండు, మూడు అభ్యంతరాలతో రాష్ట్రానికి తిప్పి పంపనున్నట్టు సమాచారం. ఆ అభ్యంతరాలను సరిచేసి మళ్లీ కేంద్రానికి పంపే నిమిత్తం ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేసినట్టు సమాచారం. తిప్పి పంపనున్న ఈ బిల్లు రెండు, మూడు రోజుల్లో సంబంధిత అధికారులకు చేరనుంది.