: ఐపీఎల్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాం: బాలీవుడ్ నటి సాగరికా ఘాట్గే
నిన్న మొన్నటి వరకు రహస్యంగా చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరికా ఘాట్గే నిశ్చితార్థం జరిగిన సంగతి తాజాగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇంత వరకు నవ్వుతూ తప్పించుకున్న సాగరికా ఘాట్గే తొలిసారి జహీర్ ఖాన్ తో వివాహం గురించి స్పందించింది. బాలీవుడ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సాగరిక మాట్లాడుతూ, జాక్ (జహీర్ ఖాన్) ఎంగేజ్ మెంట్ ను సర్ ప్రైజ్ గా ప్లాన్ చేశాడని చెప్పింది. తనకోసం రహస్యంగా నిశ్చితార్థం ఉంగరాన్ని తెచ్చాడని తెలిపింది.
ఈ సందర్భాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని తెలిపింది. తనకు అది ప్రత్యేకంగా మిగిలిపోతుందని చెప్పింది. ఐపీఎల్ ముగియగానే వివాహం గురించి చర్చించుకుంటామని వెల్లడించింది. ఐపీఎల్ లో జాక్ బిజీగా ఉన్నాడని, బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉందని తెలిపింది. అది ముగిసిన తరువాత తీరిగ్గా చర్చించుకుని వివాహం చేసుకుంటామని తెలిపింది. అన్నీ ప్రణాళికా బద్దంగా పూర్తైన తరువాత వివాహం చేసుకుంటామని సాగరిక వెల్లడించింది.