: ‘బాహుబలి 2’లో ప్రభాస్ డూప్ ఇతనే!


ఈ నెల 28న విడుదల కానున్న ‘బాహుబలి-2’ కోసం ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి-2’లో ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయనే వార్తలు వినవస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు రిస్కీ ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ ను చేసేందుకు ప్రభాస్ కు డూప్ గా కిరణ్ రాజు అనే వ్యక్తి నటించినట్టు తెలుస్తోంది. కిరణ్ రాజు ఎత్తు, పర్సనాలిటీ, హెయిర్ స్టైల్ అచ్చు గుద్దినట్టుగా ప్రభాస్ లా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News