: లండన్ లో గుజరాతీ సింగర్లపై ‘పౌండ్స్’ వెదజల్లారు!
గాయకులపై డబ్బుల వర్షం కురిపించడం గుజరాత్ ప్రజలకు కొత్తేమికాదు. తాజాగా, లండన్ లో నిర్వహించిన ఓ మ్యూజికల్ ఈవెంట్ కు గుజరాతీ జానపద గాయకులు కీర్తిదాన్ గధ్వి, మాయాభాయ్ అహిర్ హాజరయ్యారు. వీరికి స్వాగతం పలికేందుకు వందలాది ఎన్ఆర్ఐ గుజరాతీలు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. వీరి పాటలకు మైమరచిపోయిన ఎన్ఆర్ఐ గుజరాతీలు వారిపై పౌండ్ల వర్షం కురిపించారు. కాగా, గత ఏడాది గుజరాత్ లోని నవసరి జిల్లాలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న గాధ్వీపై డబ్బుల వర్షం కురిపించారు. సుమారు నలభై లక్షల రూపాయల వరకు ఆయనపై వెదజల్లారు.