: ప్రియుడితో క‌లిసి ప‌శ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చేసింది... రెండు నెలలకే ఆత్మ‌హ‌త్య చేసుకుంది!


ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఓ యువతి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు ప‌లు అంశాల‌పై ఆరా తీశారు. అయితే, ఆ దంపతులు ప‌దే ప‌దే గొడవ ప‌డేవార‌ని స్థానికులు పోలీసుల‌కి చెప్పారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రిస్తున్నాడని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, దాస్‌ సోమా (22) ప్రేమ‌లో ప‌డ్డార‌ని, అయితే, వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు ఏటూరునాగారంకు వ‌చ్చేసి, వివాహం చేసుకొని కాపురం పెట్టారని తెలిపారు. కాగా, పెళ్లయిన రెండు నెలలకే దాస్‌ సోమా అనుమానాస్ప‌ద‌ స్థితిలో మృతి చెందిందని, ఆమె భ‌ర్త మాత్రం ఆమె ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోయింద‌ని చెబుతున్నాడ‌ని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News