: నా దుస్తులు అమ్మైనా సరే ధోనీని సొంతం చేసుకుంటా: షారుఖ్ ఖాన్


టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లోకి తీసుకునేందుకు ఆ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్ కృతనిశ్చయంతో ఉన్నాడు. వచ్చే ఏడాది ఆటగాళ్ల వేలం పాటలో తన దుస్తులు అమ్మైనా సరే ధోనీని దక్కించుకుంటానని షారుఖ్ తెలిపాడు. వేలం ప్రక్రియకు ధోనీ అందుబాటులో ఉంటే చాలని... అతన్ని కొనుగోలు చేయడానికి తాము ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పాడు. ఓ క్రీడా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా షారుఖ్ ఈ విధంగా స్పందించాడు. ధోనీకి ఉన్న భారీ క్రేజ్ కోల్ కతా టీమ్ కు ఉపయోగపడుతుందని షారుఖ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ధోనీని సొంతం చేసుకోవడానికి ఇతర ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News