: 16 ఏళ్ల ప్రమాణాన్ని లతా మంగేష్కర్ కోసం పక్కనబెట్టిన అమీర్ ఖాన్!


ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒక మాట ఇస్తే దానిమీద నిలబడతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల క్రితం ఒక అవార్డుల ఫంక్షన్ కు హాజరైన అమీర్ ఖాన్ ఆ వేడుక ముగిసిన అనంతరం ఇకపై సినీ అవార్డుల ఫంక్షన్లలో పాల్గొననని ప్రకటించాడు. అన్నట్టే స్నేహితులు సల్మాన్, షారూఖ్ ఖాన్ లు పిలిచినా ఏనాడూ అవార్డుల ప్రదానోత్సవాల్లో పాల్గొనలేదు. అయితే గత 16 ఏళ్లుగా ఫాలో అవుతున్న రూల్ ను తొలిసారి ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ కోసం బ్రేక్ చేశాడు.

గానకోకిల లతామంగేష్కర్ తండ్రి మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ 75వ వర్థంతి సందర్భంగా ఆమె అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ‘దంగల్‌’లో నటనకుగానూ ఆమిర్‌ ఖాన్ కు అవార్డు అందజేయాలనుకున్నారు. దీంతో ఆమె ‌అమీర్ ఖాన్ కు స్వయంగా ఫోన్‌ చేసి ఈ అవార్డు గురించి వివరించి, స్వయంగా స్వీకరించాలని కోరారు. దీంతో ఆమె ఆహ్వానాన్ని కాదనలేకపోయిన అమీర్ ఖాన్ సుదీర్ఘ విరామం తరువాత ఆమె తండ్రి పేరిట ఇచ్చిన అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా అందుకోవడం విశేషం. 

  • Loading...

More Telugu News