: విడాకులు తీసుకున్న బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్


బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ 16 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పాడు. రెండేళ్ల ప్రేమాయణం తరువాత స్టైలిస్ట్ అధూనా భంబానీని ఫర్హాన్ అఖ్తర్ 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమ, వైవాహిక బంధానికి గుర్తుగా శక్య, అకీరా జన్మించారు. అనంతరం ఏర్పడిన మనస్పర్థల నేపథ్యంలో వీరిద్దరూ 2016లో ముంబైలోని బాంద్రాలో ఫ్యామిలీ కోర్టును విడాకుల నిమిత్తం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. శక్య, అకీరాల బాధ్యతలు తల్లి అధూనా భంబానీకి అప్పగించారు. పిల్లలను చూసేందుకు ఫర్హాన్ ఎప్పుడైనా వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. దీంతో విడాకులు తీసుకున్న బాలీవుడ్ జంటల్లో ఫర్హాన్ జంట కూడా చేరింది. 

  • Loading...

More Telugu News