: రష్యన్ సినిమాకు సంతకం చేసిన భల్లాలదేవ
అంతర్జాతీయ స్థాయి సినిమాగా మీడియా అభివర్ణిస్తున్న 'బాహుబలి' సీరీస్ లో భల్లాలదేవుడి పాత్రలో రాణించిన రానా దగ్గుబాటి హాలీవుడ్ సినిమాలకు సంతకాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. భారీకాయుడైన రానాకు సరిపడే సినిమాలు తెలుగులో రావడం లేదన్నది నిర్వివాదాంశం. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ లలో మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇప్పటికే 'ఏ మూమెంటరీ లాఫ్స్ ఆఫ్ రీజన్' అనే హాలీవుడ్ సినిమాకు సంతకం చేసిన రానా, తాజాగా రష్యా సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.
రష్యన్ సినిమాలతోనే జాసన్ స్టాతమ్ హాలీవుడ్ యాక్షన్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. రానా కూడా యాక్షన్ ప్రధాన సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో యోధుడిగా రానా నటించనున్నట్టు ప్రాధమిక సమాచారం. 'ఏ మూమెంటరీ లాఫ్స్ ఆఫ్ రీజన్' సినిమాలో రానా లాస్ ఏంజిలెస్ లో సెటిల్ అయిన ఇండియన్ బిజినెస్ మేన్ గా నటిస్తున్నాడు.