: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మే రెండో వారం తర్వాత ఉండొచ్చు: స్పీకర్ కోడెల
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మే రెండో వారం తర్వాత ఉండొచ్చని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీఎస్టీ బిల్లు గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో డిక్లరేషన్ ను రూపొందిస్తున్నామని, కోర్ కమిటీ, సలహా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జూన్ 30 నాటికి అమరావతి డిక్లరేషన్ ను రూపొందిస్తామని స్పీకర్ కోడెల తెలిపారు.