: కొరియా తీరానికి చేరుకున్న అమెరికా భారీ జలాంతర్గామి!
ఉత్తర కొరియా సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఆ దేశంలో భారీ డ్రిల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఉత్తరకొరియా మరిన్ని న్యూక్లియర్ పరీక్షలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండడంతో అమెరికా దళాలు దీనిపై అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన 'యూఎస్ఎస్ మిచిగన్' యుద్ధ జలాంతర్గామి దక్షిణ కొరియా తీరానికి చేరుకుంది. ఇప్పటికే ఉత్తరకొరియా వైపు అమెరికాకు చెందిన కార్ల్ విన్సన్ యుద్ధ నౌకల టీమ్ బయలుదేరింది.
ఉత్తరకొరియా ప్రతి కదలికను తమ సైన్యం గుర్తిస్తుందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరకొరియా తీరానికి చేరుకున్న అమెరికా జలాంతర్గామికి దాదాపు 154 తోమాహాక్ మిస్సైళ్లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఇందులో 60 స్పెషల్ ఆపరేషన్స్ ట్రూప్స్ సైతం ఉంటాయి. అణ్వాయుధ సత్తాకలిగిన ఈ జలాంతర్గామి ఉత్తరకొరియాకు చేరుకోవడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.