: నా ఫామ్ హౌస్ లో మాదిరే రైతులంతా పంటలు పండించాలి: కేసీఆర్


తన వయసు 64 ఏళ్లని, తనకు ఏ వ్యాపకం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పచ్చటి తెలంగాణను కళ్లారా చూడాలనేదే తన ఏకైక కోరిక అని చెప్పారు. రైతుల కోసం ఎన్ని పథకాలనైనా తీసుకొస్తామని తెలిపారు. రైతులకు రూ. 8 వేలు ఇచ్చే పథకంలో దొంగలకు, దళారులకు అవకాశం ఇవ్వరాదని ఆయన అధికారులకు సూచించారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు రెండు పంటలకు గాను రూ. 8 వేలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రైతులకు ఎల్లవేళలా సేవలు అందించేందుకు 500 మంది అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారులను నియమిస్తామని చెప్పారు. తన ఫామ్ హౌస్ లో లాగానే ప్రతి రైతు కూడా పంటలను పండించాలని సూచించారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, అలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని చెప్పారు. వ్యవసాయ అధికారులతో ఈరోజు కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News