: రమణ్ సింగ్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి: దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రమణ్ సింగ్ గెలిచేందుకు మావోలు సహకరించారని అన్నారు. మావోయిస్టుల విషయంలో బీజేపీ రాజీ పడిందని విమర్శించారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఆకస్మిక దాడి జరిపిన మావోయిస్టులు 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ మాట్లాడుతూ, జవాన్ల మృత దేహాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.