: అమితాబ్ ‘సర్కార్ 3’ కొత్త పోస్టర్ విడుదల... రేపు విడుదల కానున్న మరో ట్రైలర్


దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తీస్తోన్న‌ చిత్రం సర్కార్ 3 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకుంటోంది. స‌ర్కార్ 3 సినిమా ట్రైలర్ ని ఇటీవ‌లే విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఆ ట్రైల‌ర్‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఈ సినిమాలో సర్కార్ మనవడు శివాజీ పాత్రలో అమిత్ సాద్, గోవింద్ దేశ్‌పాండే పాత్రలో మనోజ్ బాజ్‌పాయి, అను పాత్రలో హీరోయిన్ యామీ గౌతమ్, వాల్యా అనే పాత్రలో జాకీ ష్రాఫ్‌ల‌ను రాంగోపాల్ వ‌ర్మ అద్భుతంగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి మరో ట్రైలర్ ని రేపు విడుదల చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి ఓ కొత్త పోస్ట‌ర్‌ను కూడా ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో విడుద‌ల చేసింది. ఈ సినిమా వ‌చ్చేనెల 12న విడుద‌ల కానుంది.


  • Loading...

More Telugu News