: రెండు, మూడు నెలల్లో మోదీ మరో కీలక నిర్ణయం!


నల్ల ధనాన్ని నియంత్రించే క్రమంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పుడు అదే తరహాలో మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఉద్గారాలను నిరోధించే క్రమంలో ఇ-వాహనాలకు ప్రోత్సాహం అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొత్త సమగ్ర వాహన పథకాన్ని తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ పథకం ద్వారా బ్యాటరీలతో నడిచే రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సుల పరిచయానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతోంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News