: మార్కెట్లో కవాసకి జడ్ 1000... ధర రూ. 14 లక్షలే!


హైఎండ్ బైకులను విక్రయించే కవాసకి, భారత మార్కెట్లో జడ్ 1000, జడ్ 1000ఆర్ పేరిట రెండు కొత్త మోడల్స్ ను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 14.49 లక్షలు, రూ. 15.49 లక్షలని (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) సంస్థ తెలిపింది. 104 సీసీ ఇంజీన్‌, లిక్విడ్‌ కూల్డ్‌ బీఎస్‌ -4 ఇంజన్, 142 మాగ్జిమం పవర్‌, 111 ఎన్‌ఎం గరిష్ట  టార్క్‌, సిక్స్‌ స్పీడ్‌ గేర్ బ్యాక్స్‌, ఫ్రంట్ ఫోర్క్ సెట్టింగ్స్, బ్రేక్ ప్యాడ్, మెరుగైన షాక్ అబ్జార్బర్స్, 1435, 2045 ఎంఎం వీల్‌ బేస్‌, 17 లీటర్ల ఇంధన సామర్ధ్యం ఉంటాయని పేర్కొంది. జడ్ 1000 బైక్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ , గోల్డెన్ బ్లేజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని, జడ్‌1000ఆర్‌ ఎడిషన్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అండ్ మెటాలిక్ గ్రాఫైట్ గ్రే కలర్స్‌లోను అందుబాటులో ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News