: 'మహాభారత్'లో భీముడి పాత్రకు మోహన్ లాల్ సరైనోడు.. నన్ను సంప్రదిస్తే అందులో నటించేందుకు నేనూ సిద్ధం: ప్రభాస్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రలో 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహాభారత్ సినిమాపై బాహుబలి ప్రభాస్ స్పందించాడు. మరో మూడు రోజుల్లో తాను నటించిన బాహుబలి-2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఆయన ఆ సినిమా ప్రచార కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ ను ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయమేనని అన్నాడు. అలాగే ఆ సినిమాలో మరేదైన పాత్రకు తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్ధమని తెలిపాడు.