: మరోసారి ఉత్తర కొరియా భారీగా ఆయుధ ప్రదర్శన
ఉత్తర కొరియా తన దూకుడు చర్యలను కొనసాగిస్తోంది. ఈ రోజు మరోసారి భారీగా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఉత్తర కొరియా సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రదర్శన చేసిందని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ పేర్కొంది. ఈ భారీ ప్రదర్శన తూర్పు తీరంలోని వోన్‌సాన్ నగరంలో జరిగిందని స్పష్టం చేసింది.
ఇటీవలే తమ దేశ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఉత్తరకొరియా ఇటువంటి ప్రదర్శనే చేసిన విషయం తెలిసిందే. ఆ దేశంతో చర్చలకు సిద్ధమని అమెరికా ప్రకటన చేసినప్పటికీ ఉత్తరకొరియా ఎవరిమాటా వినకుండా ముందుకు వెళుతోంది. తమతో పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని హెచ్చరికలు జారీ చేసేలా ప్రవర్తిస్తోంది.