: చంద్రబాబుతో సమావేశమైన భూమా అఖిలప్రియ


ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ, ఈ మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించగా, దానికి అఖిలప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 2020 నాటికి దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుంటుందని, ఆ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించారు. ఆపై 2029 నాటికి మొదటి స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎలా ఉందని అఖిలప్రియను అడిగారు. శాఖపై పట్టు పెంచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News