: నాకు నచ్చలేదు... విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై వర్మ ట్వీట్!


ద‌ర్శ‌కుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. విశ్వనాథ్‌కి దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు రావడం పట్ల తాను సంతోషంగా లేనని అన్నాడు. ఎందుకంటే ఆయన‌ దాదా సాహేబ్‌ ఫాల్కే కంటే చాలా గొప్ప దర్శకులని వ‌ర్మ అన్నాడు. తాను దాదాసాహేబ్‌ సినిమాలూ చూశానని, విశ్వ‌నాథ్‌ సినిమాలూ చూశానని అన్నాడు. త‌న‌ ఉద్దేశంలో దాదా సాహేబ్‌కే విశ్వ‌నాథ్‌ పేరు మీద అవార్డు ఇవ్వాలని ఆయ‌న పేర్కొన్నాడు.


  • Loading...

More Telugu News