: తన మద్దతు 'జనసేన'కేనన్న రామ్ చరణ్!
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సమయంలోనే బాబాయ్ పవర్ స్టార్ 'జనసేన' పేరిట రంగంలోకి దిగడంతో, తన మద్దతు బాబాయ్ కేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పేశాడు. రాజమండ్రి సమీపంలో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, మెగా అభిమానులందరూ బాబాయ్ కి మద్దతివ్వాలని పిలుపునిచ్చాడు. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కు అండగా నిలవాలని కోరాడు. ఇదిలావుండగా, ఇప్పటికే నాగబాబు, తన మద్దతు పవన్ కేనని స్పష్టం చేసిన నేపథ్యంలో, ఇక చిరంజీవి మినహా మెగా కుటుంబమంతా పవన్ వెనకే ఉన్నట్టు తెలుస్తోంది.