: హర్భజన్ ఖాతాలో మరో ఘనత
టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో 200 వికెట్లను పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఫార్మాట్ లో 200 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా బజ్జీ అవతరించాడు. ఇప్పటికే భారత్ కు చెందిన అమిత్ మిశ్రా 208, రవిచంద్రన్ అశ్విన్ 200 వికెట్లు తీసి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టెస్టుల్లో 417, వన్డేల్లో 269 వికెట్లను హర్భజన్ పడగొట్టాడు.