: కార్టూన్ బొమ్మలు చూపుతూ అంగన్ వాడీ కార్యకర్తలకు పరీక్ష పెట్టిన జేసీ
అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తల తెలివితేటలకు పరీక్ష పెట్టారు. గోడలపై వేసిన కార్టూన్ బొమ్మలను చూపించి ఇవేంటని అడిగారు. వాటి పేర్లు చెప్పాలని ఆదేశించారు. వారు తెలీదని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ బొమ్మలేంటో తెలియని వారు పిల్లలకేం నేర్పుతారని గద్దించారు. ఈ ఉద్యోగానికి అనర్హులను ఎంపిక చేశారని సీడీపీఓను మందలించారు. త్వరలో తాను స్వయంగా అంగన్ వాడీ కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించి, విఫలమైన వారిని తొలగిస్తానని హెచ్చరించారు.