: టీడీపీ నుంచి ఏర్పేడు 'నాయుడు' బ్రదర్స్ సస్పెన్షన్


చిత్తూరు జిల్లా ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనుంజయనాయుడు, ఆయన సోదరుడు చిరంజీవులు నాయుడులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఇసుకను అక్రమ రవాణా చేస్తూ, రైతుల మనోభావాలను దెబ్బతీస్తూ, ఏర్పేడు లారీ ప్రమాదానికి కారణమైన వీరిద్దరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు పేరుతో చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయానికి నిన్న రాత్రి మెయిల్ అందింది.

ఏర్పేడు మండల రాజకీయాల్లో ధనుంజయనాయుడు, ఆయన సోదరుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వీరిద్దరిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత కొంత కాలంగా మునగలపాలెం రైతులు ఆందోళన చేస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... ఈ నెల 21వ తేదీన వీరు ఏర్పేడు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో తహసీల్దారు ఆఫీసులో లేరు. ఇదే సమయంలో, తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు వచ్చారన్న సమాచారంతో, వీరంతా అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓ లారీ వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో, నాయుడు బ్రదర్స్ పై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

  • Loading...

More Telugu News