: చంద్రబాబుపై వ్యాఖ్యల నేపథ్యంలో.. గుంటూరు జిల్లా కలెక్టర్ పై ఏపీ ప్రభుత్వం సీరియస్
గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ విధానం మంచిది కాదని... ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదంటూ ఇటీవల ఓ సభలో కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అత్యున్నత ఉద్యోగి అయి ఉండి కూడా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో దండే నుంచి వివరణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ ఐఏఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం మంచిది కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు.