: రాయబారులను కడుపుబ్బ నవ్వించిన ట్రంప్!


తమ దేశ రాయబారులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కడుపుబ్బ నవ్వించారు. తమ ప్రభుత్వ లక్ష్యాల గురించి వారికి వివరిస్తూ, అందులోనే సున్నిత హాస్యాన్ని కలిపి ట్రంప్ మాట్లాడిన తీరుతో అక్కడున్న వారంతా హాయిగా నవ్వుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం గల దేశాలకు విదేశీ రాయబారులుగా పని చేస్తున్న వారితో ట్రంప్ వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. వీరందరికీ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం వారితో మాట్లాడారు.

ఈ సందర్భంగా నిక్కీ హేలీని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. ఆమె పనితీరు చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఆమెలా ఎవరైనా పని చేయగలరా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఆమెలా ఎవరూ పని చేయలేకపోయినా, ఆమె పని చేయకపోయినా... ఆమె స్థానాన్ని భర్తీ చేయవచ్చని... అయితే, ఆ పని తాను చేయబోనని చెప్పారు. వాస్తవానికి ఆమె ఎంతో బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. 

  • Loading...

More Telugu News