: యుద్ధానికి దిగితే అమెరికా ఇక సమూల నాశనమే: ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరిక


దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాల కోసం అమెరికాకు చెందిన అణ్వస్త్ర విమాన వాహక యుద్ధ నౌక, కొరియా తీరానికి రానుండటంతో, ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరికలు చేసింది. విన్యాసాల పేరిట అమెరికా ఈ ప్రాంతంలో యుద్ధానికి దిగితే, ఆ దేశాన్ని సమూలంగా నాశనం చేసే శక్తి తమకుందని చెప్పింది. కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అమెరికాయే కారణమని ఆ దేశ మీడియా పేర్కొంది.

ఇక ఇటీవలి కిమ్ ఇల్ జాంగ్ జయంతి వేడుకల్లో కొత్త ఆయుధాలను ప్రదర్శించిన ఉత్తర కొరియా, వాటిని ప్రయోగిస్తే అమెరికాలో ఏ నగరాన్నైనా భస్మీపటలం చేయగలమని చెప్పిన సంగతి తెలిసిందే. తాము యుద్ధం చేసేందుకు సిద్ధమంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియాను నిలువరించేందుకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ప్రారంభించి, చర్చలకు ఆహ్వానించింది.

  • Loading...

More Telugu News