: ఆ డాక్టర్ తీవ్రంగా మోసం చేశాడు... 500 కిలోల స్థూలకాయురాలు ఇమాన్ సోదరి సంచలన ఆరోపణ


ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా, సుమారు 500 కిలోల బరువుతో చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ఇండియాకు వచ్చి, ముంబై సీపీ ఆసుపత్రిలో చేరిన ఇమాన్ అహ్మద్ అబ్దులాటిని డాక్టర్ ముఫజల్ లక్డావాలా తీవ్రంగా మోసం చేశారని ఆమె సోదరి సైమా ఆరోపించింది. ఇమాన్ దాదాపు 250 కిలోల బరువు తగ్గిందని, మరో ఆరు నెలల్లో ఇంకో 50 కిలోలకు పైగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్న విషయాన్ని సైనా ఖండించింది.

తన అక్క అసలు కోలుకోలేదని, ఆమె ఆరోగ్యం కొంచెం కూడా బాగుపడలేదని, లక్డావాలా అబద్ధాలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, సైమా వ్యాఖ్యలను లక్డావాలా ఖండించారు. సైమా ఇప్పుడు కావాలనే ఇలా ఆరోపణలు చేస్తూ, సీన్ క్రియేట్ చేస్తోందని, ఆమెను త్వరలో సీటీ స్కాన్ రూముకు తీసుకెళతామని, ఆ సమయంలో సైమా మాటల్లో నిజమెంతో అందరికీ తెలుస్తుందని అన్నారు. ఇమాన్ కోలుకుందని, ఇక ఈజిప్టు తీసుకువెళ్లచ్చని చెప్పినప్పటి నుంచి సైమా ఈ గొడవను ప్రారంభించిందని లక్డావాలా అన్నారు.

  • Loading...

More Telugu News