: రైతులకు మద్దతుగా నేడు తమిళనాడు బంద్.. మద్దతు ప్రకటించిన సినీ ప్రముఖులు
రైతులకు మద్దతుగా నేడు తమిళనాడు బంద్కు ప్రతిపక్ష డీఎంకే పిలుపునిచ్చింది. రోజుల తరబడి ఢిల్లీలో తమిళ రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్టు అయినా లేదని విమర్శించిన డీఎంకే ఈ బంద్కు పిలుపు ఇస్తున్నట్టు పేర్కొంది. డీఎంకే పిలుపుకు సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. వివిధ వాణిజ్య సంస్థలు కూడా రాష్ట్ర బంద్కు మద్దతు ప్రకటించాయి.